ఆ పాపే ఈ పాప..!

పెంపుడు తండ్రి చేతుల్లో నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారి కథ తెలుసా మీకు..

ఉత్తరప్రదేశ్ బరేలీలో సరిగ్గా ఏడాది క్రితం శ్మశానంలో మట్టికుండలో పెట్టి గుడ్డలు చుట్టి ఈ పాపను పాతిపెట్టారు..

అప్పుడే పుట్టి చనిపోయిన మరో బాబును ఖననం చేస్తుండగా శ్మశానం వాచ్ మన్ కు పాప ఏడుపు వినిపించింది..వెంటనే అతను చిన్నారిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లాడు.

కేవలం 1.2 కేజీ ల బరువు,Bacterial infection,10 వేలకు పడిపోయిన ప్లేట్ లెట్స్.. పాప మృత్యువుతో పోరాడింది. వైద్యుల పర్యవేక్షణలో వారంరోజులకు క్రమంగా కోలుకోవడం మొదలైంది.

స్థానిక బీజేపీ MLA ఆ పాప వైద్యానికి అయిన ఖర్చు అంతా భరించారు. అంతేకాదు భూమిలో దొరికిన ఆ పాప సాక్షాత్తు సీతమ్మతల్లే అనుకున్నారు. తనని సాకడం అదృష్టం అని మురిసిపోయారు..

ఇదిగో పాప ఇప్పుడు ఇంతైంది. తనని దత్తత తీసుకున్న MLA సంరక్షణలో ఇలా హాయిగా నవ్వులు చిందిస్తూ ఆరోగ్యంగా ఉంది.