మైండ్ మీడియా – ‘పద్యం -హృద్యం’ పోటీ ఫలితాలు

ప్రియమైన మైండ్ మీడియా శ్రోతలకు సంక్రాంతి శుభాకాంక్షలు.

మేము నిర్వహించిన ‘పద్యం -హృద్యం’ పోటీలలో ఎంతో ఉత్సాహంతో పాల్గొన్న అందరికీ కృతజ్ఞాతభివందనాలు. ఈ పోటీలకు మీరు పంపిన రచనలను సాహితీ దిగ్గజాల వంటి ముగ్గురు జడ్జీలు పరిశీలించిన మీదట క్రింది విధంగా ఫలితాలను అందించారు.

ప్రధమ బహుమతి : ఓలేటి శశికళ 
ద్వితీయ బహుమతి : రామచంద్ర రాజు కలిదిండి, సురేష్ 
తృతీయ బహుమతి : బల్లూరి ఉమాదేవి, పిన్నలి గోపీనాథ్ 

నాలుగు కన్సొలేషన్ బహుమతులు : మంతెన ఝాన్సీ, ప్రకాశం పంతులు, నండూరి సుందరి నాగమణి, మంథా భానుమతి.

ఈ పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రోత్సాహక బహుమతి, ప్రశంసా పత్రం అందజేయబడతాయి.

గమనిక : మాకు పంపిన పద్యాలు, బహుమతి ప్రదానోత్సవం వరకు ఎక్కడా పోస్ట్ చెయ్యవద్దు అని మనవి.
కొందరు పోటీలకు మేము అందించిన అంశం ‘భారతీయత’ పై కాకుండా, వేరే అంశం పై పద్యాలు పంపారు. వారు అందరికీ కూడా మార్చ్ 1 న మేము ఘనంగా నిర్వహించే బహుమతి ప్రదానోత్సవ సభలో బహుమతులు ఇవ్వడం జరుగుతుంది.

విజేతలు అందరికీ మా అభినందనలు. పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి

కృతజ్ఞాతభివందనాలతో

మైండ్ మీడియా కుటుంబం.