“హృదయరాగం” ప్రైవేట్ ఆల్బమ్స్ పోటీలు

సంగీతం – మనసు భాష. అందుకే పక్షులు, పాములు, శిశువులూ, సమస్త జగతి మధురసంగీతం వింటే మైమరచిపోతాయి. మంచి సంగీతానికి, ఇక సాహిత్యం తోడైతే, శ్రోతలు ఆ పాటలో, భావంలో మమేకమైపోతారు. అందుకే మంచి సంగీతాన్ని, సాహిత్యాన్ని ప్రోత్సహించాలన్న సదుద్దేశంతో – సంగీతం పట్ల మక్కువతో చేసిన వివిధ ప్రైవేట్ ఆల్బమ్స్ ను పోటీలకు ఆహ్వానిస్తోంది – మైండ్ మీడియా.  లలిత గేయాలు, ఆధ్యాత్మిక గేయాలు, ప్రేమ గీతాలు, భావ గీతాలు – ఇలా ఏవైనా, పోటీలకు అర్హమే. 1980 తర్వాత రికార్డు చేసిన ఆల్బమ్స్ మాత్రమే పోటీలకు పరిగణించబడతాయి. ఈ పోటీల్లోని విజేతలకు బహుమతులు…

ప్రధమ విజేత – 10,000 రూ.

ద్వితీయ విజేత – 6000 రూ.

తృతీయ విజేత – 3000 రూ.

కన్సలేషన్ ప్రైజ్ లు – 2000 (2000 x3= 6000) రూ.

నిబంధనలు:

  1. ఆల్బమ్స్ పూర్తిగా మీవేనన్న హామీపత్రం జత చెయ్యడం తప్పనిసరి.
  2. ఆల్బం ఏ ఇతర సినీ బాణీలకు అనుకరణ/ అనుసరణ కాకూడదు. స్వయంగా రూపొందించినది కావాలి.
  3. సంగీతానికి, సాహిత్యానికి మా పోటీల్లో పెద్దపీట వేస్తాము. ఆధ్యాత్మిక సంబంధమైన గేయాలు కూడా పరిగణించబడతాయి.
  4. పోటీలకు మీరు పంపే గేయాలు మైండ్ మీడియా లో ప్రసారం చేసేందుకు అనుమతిని ఇచ్చినట్టే. వాటిని అవకాశాన్ని, సందర్భాన్ని బట్టి (జుమ్బ్లింగ్ విధానంలో) రేడియోలో ప్రసారం చేస్తాము.
  5. బహుమతుల విషయంలో మా న్యాయనిర్ణేతలదే తుది నిర్ణయం, ఈ విషయంలో ఎటువంటి వాదోపవాదాలకు తావు లేదు.
  6. మీ cd లు, లేక పాటల ఆన్లైన్ లింక్ లు/ యు ట్యూబ్ లింక్ లు పంపాల్సిన  ఈమెయిలు… info@myindedia.com
  7. ఎంట్రీలు పంపాల్సిన చివరి తేదీ… 31-12-2015

7 COMMENTS

    • నమస్కారం విజయనిర్మల గారు. సామాజిక జాగృతిపరమైన పాటలకూ స్వాగతం. ఒక ఆల్బం లో కనీసం 6 పాటలు ఉంటే చాలండి. మీరూ ఉత్సాహంగా పాల్గొంటారని, ఎదురు చూస్తూ ఉంటాము.