ప్రకృతి మాత వసంతమాసపు పచ్చచీరను కట్టుకుని, కోయిల కమ్మటి గానం స్వాగతిస్తుండగా, మనోజ్ఞంగా కనువిందు చేసే తరుణం... ఏడాది పాటు తెలుగు మనసులన్నీ వేచి చూచిన శుభతరుణం ఆసన్నమయ్యే సమయం ... మన తొలి పండుగ వచ్చిందోయ్, అంటూ ప్రతి ముంగిలి, కళకళ లాడిపోయే క్షణం... ఆ క్షణంలో మీ మనసులో కలిగే స్పందనకు చక్కటి అక్షరరూపం ఇస్తే... అది మరిన్ని మనసుల్ని రంజింపచేసే చక్కటి కవిత అవుతుంది. అటువంటి కవితల్ని రాసి, మాకు పంపండి.